ఆత్మహత్య కారకులను కఠినంగా శిక్షించండి
భారతీయ జనతా పార్టీ వేమనపల్లి మండల అధ్యక్షులు ఏట మధుకర్ ఆత్మహత్య కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని, వేమనపల్లి ఎస్సై ని సస్పెండ్ చేయాలని తాండూర్ మండల కేంద్రంలోని ఐబి సెంటర్ లో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ ఆత్మహత్యకు కారకులైన ప్రతి ఒక్కరిని ప్రభుత్వ కఠినంగా శిక్షించాలన్నారు. ఏట మధుకర్ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రజా సమస్యలపై ఉద్యమిస్తున్న బీజేపీపై కక్ష సాధింపు చర్యలో భాగంగా ఏకంగా మండల అధ్యక్షుడిపై అక్రమంగా కేసులు బనాయించి ఆత్మహత్యకు కారణమయ్యారని దుయ్యబట్టారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే వెంటనే స్పందించి వారిని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, ఏట మధుకర్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు దూడపాక భరత్ కుమార్, జిల్లా కార్యదర్శి రామగౌని మహీధర్ గౌడ్, జిల్లా అధికార ప్రతినిధి చిలుముల శ్రీకృష్ణదేవరాయలు, సీనియర్ నాయకులు చిలువేరు శేషగిరి, పులగం తిరుపతి, తుకారాం, జిల్లా కార్యవర్గ సభ్యులు సిద్ధం మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.