నీల్వాయికి కేంద్ర మంత్రి బండి సంజయ్
Union Minister Bandi Sanjay:కేంద్రమంత్రి బండి సంజయ్ మంచిర్యాల జిల్లా రానున్నారు. ఆయన కాసేపట్లో బెల్లంపల్లి నియోజకవర్గంలోని నీల్వాయి గ్రామానికి చేరుకుంటారు. ఆయన సాయంత్రం 6 గంటలకు నీల్వాయిలో వేమనపల్లి బీజేపీ మండలాధ్యక్షుడు ఏట మధుకర్ కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఏట మధుకర్ అధికార పార్టీ కాంగ్రెస్ నేతల వేధింపులు భరించలేక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మధుకర్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడతారు. మధుకర్ కుటుంబానికి అండగా నిలవడంతోపాటు బీజేపీ శ్రేణులకు భరోసా ఇవ్వనున్నారు.