బంద్ కి మద్దతుగా ఆందోళన
బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలంటూ కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన బంద్ కొనసాగుతోంది. దీనిలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ఎదుట బైఠాయించారు. మాజీ మంత్రి జోగు రామన్న బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి బస్సులు బయటకి రాకుండా గేటు ఎదుట నిరసన తెలిపారు .
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ముందు బీసీ సంఘాలు ధర్నా నిర్వహించాయి. బస్సులు బయటకు వెళ్లకుండా డిపో ముందు బైఠాయించి బిసి లకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.