భార్య‌ను బ్రిడ్జిపై నుంచి తోసేసి హ‌త్య‌

Wife murdered by being pushed off a bridge:జాతీయ‌ర‌హ‌దారికి చెందిన బ్రిడ్జిపై నుంచి తోసేసి భార్య‌ను హ‌త్య చేశాడో భ‌ర్త‌.. మంచిర్యాల జిల్లా నస్పూర్ లో జ‌రిగిన ఈ ఘ‌ట‌న వివ‌రాలు ఇలా ఉన్నాయి. జ‌గ‌న్నాథం ర‌జిత‌(26) అనే మ‌హిళ‌ను భ‌ర్త కుమారస్వామి నస్పూర్ మండల కేంద్రం ఉన్న జాతీయ ర‌హ‌దారిపై బ్రిడ్జి పై నుంచి తోసేశాడు. దీంతో ర‌జిత కిందపడి అక్కడికక్కడే మృతి చెందింది. ఆదివారం రాత్రి 2 గంటల ప్రాంతంలో ఘటన జ‌రిగింది. కుటుంబ కలహాల వ‌ల్ల‌నే ఈ ఘ‌ట‌న జ‌రిగింద‌ని, భార్యపై అనుమానంతోనే హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న నస్పూర్ పోలీసులు, కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like