పండుగ పూట విషాదం..
దీపావళి వేళ గోదావరి స్నానానికి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ యువకుడు ప్రాణహిత నదిలో గల్లంతైన విషాద ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే… మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రొయ్యలపల్లికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు దాగామ శ్రీశైలం (25) ప్రాణహిత నదిలో గల్లంతయ్యాడు. దీపావళి పండుగను పురస్కరించుకుని స్నానం కోసం నదికి వెళ్లిన శ్రీశైలం నీటిలో మునిగి గల్లంతయ్యాడు. ఆలుగామ గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. SI రాజేందర్ సంఘటన స్థలం చేరుకొని గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు.