మిగిలింది 65 మందే..
DGP Shivdhar Reddy about Maoists: తెలంగాణ నుంచి ఇంకా సుమారు 65 మంది మావోయిస్టులు యాక్టివ్గా ఉన్నారని డీజీపీ శివధర్ రెడ్డి (DGP Shivdhar Reddy) వెల్లడించారు. ఆయన నిజామాబాద్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మావోయిస్టులు లొంగిపోవాలని ఇప్పటికే సీఎం సూచించారని, తెలంగాణ నుంచి ఇంకా సుమారు 65 మంది మావోయిస్టులు యాక్టివ్గా ఉన్నారని స్పష్టం చేశారు.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో మావోయిస్టు పార్టీ(Maoist Party)లో ఉన్న అగ్ర నేతలతో పాటు వివిధ క్యాడర్లలో ఉన్న వారు ఆయుధాలు అప్పగించి లొంగిపోతున్నారని ఆయన వెల్లడించారు. తెలంగాణలో ఉన్న వారు సైతం లొంగిపోవాలని ఆయన స్పష్టం చేవారు. వారంతా త్వరలోనే లొంగిపోతారని ఆశిస్తున్నామన్నారు. వారిపై ఉన్న కేసుల విషయంలో సానుభూతితోనే వ్యవహరిస్తామని, ఎలాంటి వేధింపులు ఉండవని వివరించారు. మావోయిస్టులు నిర్భయంగా సరెండర్ కావొచ్చు. కేసులు ఏమైనా ఉంటే కొట్టేస్తాం. పోలీస్, రెవెన్యూ, మీడియా, ఇలా ఎవరి ఆధ్వర్యంలోనైనా లొంగిపోవచ్చన్నారు.