నిరుద్యోగులు జాబ్‌మేళా ఉప‌యోగించుకోవాలి

Mega job fair in Bellampalli:ఈనెల 26న(ఆదివారం) బెల్లంపల్లిలో మెగా జాబ్ మేళాను నిరుద్యోగ అభ్యర్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్(Bellampally MLA Gaddam Vinod) కోరారు. శనివారం బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఇలాంటి అవ‌కాశం మ‌ళ్లీ రాద‌ని, దీనిని యువ‌త ఉప‌యోగించుకోవాల‌ని ఎమ్మెల్యే కోరారు. మందమర్రి సింగరేణి జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ మాట్లాడుతూ 70 రకాల ఫార్మా, ఐటీ, బ్యాంకింగ్ కంపెనీలు ఈ మేళాలో పాల్గొననున్నట్లు తెలిపారు. ఏడవ తరగతి నుండి పీజీ వరకు అర్హులైన నిరుద్యోగులు అందరికీ ఉద్యోగ అవకాశాలను కల్పించాల‌ని సింగరేణి సంస్థ ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు.

సమావేశంలో బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, ఏసీపి ఏ రవి కుమార్, మందమర్రి ఏరియా ఎస్ ఓ టు జిఎం విజయ్ ప్రసాద్, పర్సనల్ మేనేజర్ ఎస్. శ్యాంసుందర్, సెక్యూరిటీ ఆఫీసర్ రవీందర్, నోబెల్ ఎంపవర్మెంట్ ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రాజెక్ట్ మేనేజర్ గోగర్ల శోభన్ బాబు, సొసైటీ సమన్వయకర్త తాళ్లపల్లి అశోక్, బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ముచ్చర్ల మల్లయ్య, సీనియర్ నాయకులు మునిమంద రమేష్, నాయకులు దావ రమేష్ పాల్గొన్నారు.

 

Get real time updates directly on you device, subscribe now.

You might also like