డీజీపీ ఎదుట లొంగిపోయిన బండి ప్రకాష్
Maoist Party:మావోయిస్టు కీలక నేతలు లొంగిపోతున్న తరుణంలో తెలంగాణకు చెందిన మావోయిస్టు పార్టీ ముఖ్యనేత బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్(Bandi Prakash alias Prabhat) పోలీసులకు లొంగిపోయారు. ఈ రోజు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి(Telangana DGP Shivdhar Reddy) సమక్షంలో బండి ప్రకాష్ లొంగిపోయారు. బండి ప్రకాష్ స్వస్థలం మంచిర్యాల జిల్లా మందమర్రి. 1982-84 మధ్య గో టు ద విలేజెస్ ఉద్యమం ద్వారా ఆర్ఎస్‌యూ తరఫున పోరాడారు. ఆపై మావోయిస్ట్ పార్టీ అనుబంధ సంస్థ సింగరేణి కార్మిక సంఘం(సి.కా.స.) అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. మావోయిస్ట్ పార్టీలో నేషనల్ పార్క్ ఏరియా అత్యంత కీలక ఆర్గనైజర్ బండి ప్రకాష్. దాదాపు 45 సంవత్సరాలుగా సీపీఐ మావోయిస్టు పార్టీలో వివిధ స్థాయిలలో రాష్ట్ర కమిటీ సభ్యుడుగా పనిచేసిన ప్రకాష్ పోలీసుల ఎదుట లొంగపోవడం మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బే అని చెప్పుకోవాలి.