ఆధారం కల్పించాలి… ఆదుకోవాలి…
తమకు ఆధారం కల్పించి ఆ తర్వాతే రోడ్డు వెడల్పు చేయాలని బెల్లంపల్లి లో వ్యాపారస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం కాంట ఏరియా లో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్ల పక్కనే ఉన్న తమ షాపులు కోల్పోతున్నామని తమకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు వెడల్పులో తమ షాపులు పోతే రోడ్డున పడతామని స్పష్టం చేశారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు పక్కకి పంపించేశారు.
రోడ్డు విస్తరణలో భాగంగా బెల్లంపల్లిలో రోడ్డుకు ఇరువైపుల ఉన్న కట్టడాలు, ఆక్రమణలు తొలగిస్తున్నారు. శుక్రవారం నుండి ఈ పనులు ప్రారంభం అయ్యాయి. సింగరేణి ఆసుపత్రి నుండి కాంటా ఏరియా వరకు రోడ్డు విస్తరించనున్నారు.