సహాయక చర్యల్లో సీఐకి గాయాలు
CI injured in rescue operations:చేవెళ్లలోని మీర్జాపూర్ శివారులో జరిగిన బస్సు ప్రమాదం(Bus Accidenet)లో మృతదేహాలను వెలికితీసే సహాయక చర్యలు చేపట్టిన పోలీసులకు ఊహించని సంఘటన ఎదురైంది. జేసీబీతో మృతదేహాలను బయటకు తీస్తున్న సమయంలో, సీఐ శ్రీధర్ కాళ్లపై నుంచి జేసీబీ వెళ్లడంతో ఆయనకు గాయాలయ్యాయి. వెంటనే తోటి పోలీసులు ఆయనను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనకు చికిత్స అందిస్తున్నారు.