కార్తీక పౌర్ణమి సందడి… సత్యనారాయణ వ్రతాలు
పవిత్ర కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో దేవాలయాలు కిటకిటలాడాయి. వేకువజాము నుంచే పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు ఆలయాలకు తరలివచ్చి ప్రత్యేక పూజలు, కార్తీక దీపాలు వెలిగించారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం మాదారం టౌన్‌షిప్‌లోని కోదండ రామాలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. దంపతుల చేత వేద పండితులు, ఆలయ అర్చకులు ముద్దు అవధూత శర్మ సత్యనారాయణ స్వామి వ్రతం జరిపించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆచరించారు.