పాకిస్తాన్లో భారీ పేలుడు.. ఐదుగురు మృతి
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో మరో ఘోర ఘటన చోటు చేసుకుంది. ఇస్లామాబాద్ కోర్టు కాంప్లెక్స్ సమీపంలో కారు పేలుడు సంభవించగా, ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, మరో 20 నుండి 25 మంది వరకు గాయపడ్డారు. మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో ఈ విస్ఫోటనం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఆ సమయానికి కోర్టు కాంప్లెక్స్ పరిసరాలు రద్దీగా ఉండటంతో అక్కడున్న న్యాయవాదులు, ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. స్థానిక పోలీసులు, రక్షణ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన దర్యాప్తు ప్రారంభమైందని అధికారులు తెలిపారు.
దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం బాంబు బ్లాస్ట్‌లో 12 మంది మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 వద్ద పార్కింగ్ ప్రాంగణంలో నిలిపిన ఓ కారు అకస్మాత్తుగా పేలిపోయింది. ప్రమాదం సమయంలో ఆ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ప్రజలు లేకపోవడం వల్ల పెద్ద నష్టం తప్పింది. ఈ క్రమంలో పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్‌లో కూడా హై అలర్ట్ ప్రకటించారు. హర్యానా, పంజాబ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు. పోలీసు కమిషనర్లు, సీనియర్ సూపరింటెండెంట్లు అప్రమత్తంగా ఉండాలని కూడా డీజీపీ తెలిపారు.