పెరుగుతున్న చలి తీవ్రత

తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. సోమ, మంగళ వారాల్లో తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఆదిలాబాద్ జిల్లాలో 10.4 డిగ్రీలు, ఆసిఫాబాద్ లో 10.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. మంగళవారం నుంచి మరింత కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరించారూ. పలు జిల్లాల్లో కనిష్ఠంగా 9-12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశముందని చెబుతున్నారు. పలుచోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు చలికి వణికిపోతున్నారు. చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. పిల్లలు, వృద్దుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like