రేపు ఆదిలాబాద్‌కు కేటీఆర్ రాక‌

KTR:బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ క‌ల్వ‌కుంట్ల తార‌క రామారావు రేపు (మంగ‌ళ‌వారం) ఆదిలాబాద్ జిల్లా(Adilabad District) రానున్నారు. ఆయ‌న ఉద‌యం ప‌దిన్నర‌కు ఆదిలాబాద్ వ‌స్తారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న రైతుల స‌మ‌స్య‌లు తెలుసుకుంటారు. ముఖ్యంగా ప‌త్తి, సోయా, ఇత‌ర పంట‌ల కొనుగోళ్ల సంద‌ర్భంగా రైతులు ప‌డుతున్న ఇబ్బందులు ప్ర‌భుత్వాల నిబంధ‌న‌ల నేప‌థ్యంలో ఆయ‌న ఆదిలాబాద్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఆయ‌న ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో ప‌త్తి రైతుల‌తో మాట్లాడి వారి క‌ష్టాల‌ను ప్ర‌త్య‌క్షంగా తెలుసుకోనున్నారు. అదే స‌మ‌యంలో సోయా, ఇత‌ర పంట‌లు, సీసీఐ కొనుగోళ్ల విధానంతో రైతుల ఇబ్బందులు ఇలా అన్ని ర‌కాలుగా రైతు స‌మ‌స్య‌లు తెలుసుకుంటారు.

రాష్ట్రంలో పత్తి కొనుగోలు సంక్షోభంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం చేస్తున్నారు. పత్తి రైతుల సమస్యలను పట్టించుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నారు. తేమశాతం, కపాస్ మొబైల్ యాప్ రిజిస్ట్రేషన్, జిన్నింగ్ మిల్లుల అవినీతి అంటూ కుంటి సాకులతో సీసీఐ (CCI) కొనుగోలుకు నిరాకరిస్తోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో పత్తి రైతులకు భారీ నష్టం వాటిల్లుతోంద‌ని, కనీస మద్దతు ధర కూడా పత్తి రైతుకు దక్కడం లేదన్న చెబుతున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like