హిడ్మా డైరీ.. కీల‌క ఆధారాలు..

Hidma Diary: మావోయిస్టు అగ్ర‌నేత మ‌డావి హిడ్మా ఎన్‌కౌంట‌ర్ ప్రాంతంలో ఆయ‌న‌కు సంబంధించిన ఓ డైరీ దొరికింది… ఆ డైరీలో ఏముంది…? ఏమేం వివ‌రాలు అందులో పొందుప‌ర్చారు…? మావోయిస్టు పార్టీకి సంబంధించిన ఏం స‌మాచారం ఉంది..? ఇలా పోలీసులు, భ‌ద్ర‌తా ద‌ళాలు పూర్తి స్థాయిలో దృష్టి సారించా
యి. ఆ డైరీలో ఉన్న స‌మాచారం ఆధారంగా గాలింపు చ‌ర్య‌ల‌తో పాటు ఇత‌ర అంశాల‌పైనా దృష్టి పెట్టారు.

మావోయిస్టు నేత మ‌డావి హిడ్మా ఎన్‌కౌంట‌ర్ ప్రాంతంలో పోలీసులు రెండు ఏకే 47లు, పిస్ట‌ల్‌, రివాల్వ‌ర్‌, కిట్‌బ్యాగులు ఇలా చాలా వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ప్ర‌ధానంగా హిడ్మాకు సంబంధించిన డైరీని స్వాధీనం చేసుకోవ‌డంతో భ‌ద్ర‌తా ద‌ళాల‌కు కీల‌క‌ స‌మాచారం ల‌భించింది. హిడ్మా డైరీలో కీలక సమాచారం ఉన్నట్టుగా తెలుస్తోంది. మావోయిస్టుల నివాసాలకు సంబంధించిన‌ వివరాలు… సంప్రదింపులకు సంబంధించిన కోడ్‌లు డంపుల లొకేషన్ల సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమాచారంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గగర్.. నాలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు పోలీసులు. మావోయిస్టులు ఏపీలో వివిధ ప్రదేశాల్లో ఎనిమిది డంప్లు ఏర్పాటు చేసినట్లు సమాచారం రావడంతో… ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకోవడం కోసం రంగంలోకి దిగి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.

భారీగా మావోయిస్టుల అరెస్టు…
ఆ డైరీ ఆధారంగానే విజ‌య‌వాడ‌లోని మావోయిస్టు కీలక నేత హిడ్మా డైరీ ఇప్పుడు భద్రతాబలగాలు, పోలీసులకు కీలక సమాచారాన్ని ఇచ్చింది. దీంతో, రంగంలోకి దిగిన ఆక్టోపస్, పోలీసులు.. విజయవాడలో మకాం వేసిన 27 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశారు. కానూరు, ఆటోనగర్ ప్రాంతంలో మొత్తం 27 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో 21 మంది మహిళలు ఉండటం సంచలనంగా మారింది. పోలీసుల ప్రాథమిక విచారణలో వీరంతా ఛత్తీస్గడకు చెందినవారని, ఈ రోజు ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టు అగ్రనేత మడావి హిడ్మా అనుచరులని గుర్తించారు. అరెస్టయిన వారిలో నలుగురు కీలక మావోయిస్టు కమాండర్లు కూడా ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు.

కూలీలుగా చెప్పుకుని అద్దెకు..
ఇక్క‌డ తాము కూలీల‌మ‌ని చెప్పుకుని మావోయిస్టులు ఈ భ‌వ‌నాన్ని అద్దెకు తీసుకున్న‌ట్లు స‌మాచారం. సుమారు 20 రోజుల క్రితం రోజువారీ కూలీలుగా చెప్పుకుంటూ ఓ బిల్డింగ్ అద్దెకు తీసుకున్నారు మావోయిస్టులు.. ఆ బిల్డింగ్ యజమాని పెనమలూరు ప్రాంతానికి చెందిన అప్పలస్వామి కాగా, ఆయనే ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మొద‌ట భ‌వ‌నంలోని అంద‌రినీ ఖాళీ చేయించిన పోలీసులు ఆ త‌ర్వాత మావోయిస్టుల‌ను అదుపులోకి తీసుకున్నారు. ఏలూరులో మరో 12 మంది, కాకినాడ జిల్లా కొప్పవరంలో ఇద్దరు మావోయిస్టులు అరెస్ట్ చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like