దాడుల వ్యూహ‌క‌ర్త‌… పేలుళ్ల‌లో దిట్ట‌..

Maoist leader Jogarao alias Tech Shankar:టెక్నికల్ ఆపరేషన్లలో దిట్ట…. పేలుళ్ల‌కు సంబంధించిన నిపుణుడు.. మావోయిస్టుల‌కు ఐఈడీ (IED -ఇంప్రవైజ్డ్ ఎక్స్ ప్లోజివ్ డివైజ్) ఎలా వాడాలో శిక్ష‌ణ ఇచ్చేవాడు.. ఒక ర‌కంగా హిడ్మా కంటే కూడా పోలీసులు ఇత‌న్ని చాలా డేంజ‌ర‌స్ వ్య‌క్తిగా చూస్తారంటే మావోయిస్టు పార్టీలో ఆయ‌న స్థానం అర్థం అవుతుంది… ఆయ‌నే మెట్టూరు జోగారావు అలియాస్ టెక్ శంకర్..

జోగారావు అలియాస్ టెక్ శంకర్…! ఈ పేరు వింటేనే పోలీసుల‌కు ఉలిక్కిపాటు.. మావోయిస్టు(Maoist) పార్టీలో ఇతను ఐఈడీలను అమర్చడంలో ఎంతో నైపుణ్యం సంపాదించాడు. మావోయిస్టులు భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుంటారు. ఆ దాడుల్లో పేలుడుకి సంబంధించి, వారి వాహనాలను ధ్వంసం చేయడానికి ఇంప్రవైజ్డ్ ఎక్స్ ప్లోజివ్ డివైజ్ లు (IEDs) లేదా మందుపాతరలు ప్రధాన ఆయుధం. టెక్ శంకర్ సంస్థలోని ఈ ఐఈడీ విభాగంలో కీలకమైన వ్యక్తి. ఇతను సాంప్రదాయ మందుపాతరలు తయారు చేయడమే కాకుండా, వాటిని గుర్తించకుండా ఉండేందుకు, మరింత విధ్వంసక శక్తిని పెంచడానికి కొత్త సాంకేతిక పద్ధతులను ఉపయోగించేవాడని పోలీసులు చెబుతున్నారు.

చాలా మైనింగ్ ఆపరేషన్లలో ప్రమేయం….
గత కొన్నేళ్లుగా ఆంధ్ర- ఒడిశా సరిహద్దు (AOBSZC) ప్రాంతంలో మావోయిస్టులు ఉపయోగించిన అనేక శక్తివంతమైన ఐఈడీల తయారీ, వాటిని అమర్చే ప్రణాళికల్లో ఇతని కీలక ప్రమేయం ఉంది. ఐఈడీలు, కమ్యూనికేషన్ టెక్నాలజీ వంటి సాంకేతిక అంశాలలో ఇతను ముఖ్య నిర్ణయాలు తీసుకునేవాడు. మావోయిస్టుల్లోని యువ కేడర్ కు ఐఈడీలను ఎలా తయారు చేయాలి….? వాటిని ఎలా అమర్చాలి…? అనే అంశాలపై శిక్షణ కూడా ఇచ్చేవాడు.

పోలీసుల‌ హిట్‌లిస్ట్‌లో…
మావోయిస్టుల‌కు పేలుళ్ల‌లో శిక్ష‌ణ ఇస్తుండ‌టం, చాలా మందికి సాంకేతిక నైపుణ్యం అంద‌చేస్తుండ‌టం వ‌ల్ల పోలీసులకు హిట్‌లిస్ట్‌గా మారాడు. బుధ‌వారం ఆంధ్ర రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని జీఎం వలస అటవీ ప్రాంతంలో జ‌రిగిన ఎన్ కౌంటర్ లో జోగారావు అలియాస్ టెక్ శంకర్ నేల‌కొరిగారు. ఆయ‌న‌తో పాటు అలాగే పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు నంబాల కేశవరావు ప్రోటెక్షన్ టీం కమాండర్, డివిజనల్ కమిటీ సభ్యురాలు జ్యోతి, మావోయిస్టు పార్టీ కమ్యూనికేషన్ టీం ఛీఫ్, సౌత్ జోనల్ కమిటీ మొంబర్ సురేష్ అలియాస్ రమేష్, ఏరియా కమిటీ సభ్యులు జాగరగొండ ఏరియా మిలిషియా కమాండర్ లోకేష్ అలియాస్ గణేష్, జాగరగొండ డిప్యూటీ కమాండర్, ఏరియా కమిటీ సభ్యుడు శ్రీను అలియాస్ వాసు.. జాగరగొండ డివిజినల్ కమిటీ, ఏరియా కమిటీ సభ్యురాలు అనిత, ఇదే కమిటీలో సభ్యురాలు షమ్మి ఎన్‌కౌంటర్‌లో మరణించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like