ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న‌.. మూడంచెల భ‌ద్ర‌త‌

-700 మంది పోలీసు సిబ్బందితో పటిష్టమైన భద్రత చర్యలు
-9 సెక్టార్లు గా విభజించి బందోబస్తు ఏర్పాటు
-హెలిపాడ్, మీటింగ్ ప్లేస్, పార్కింగ్, రోడ్ అన్ని ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు

ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా పోలీసులు ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా మూడంచెల భ‌ద్ర‌త ఏర్పాటు చేసిన‌ట్లు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్(SP Akhil Mahajan) స్ప‌ష్టం చేశారు. 700 మంది పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. మొత్తం 9 సెక్టార్లుగా విభజించి బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథి హెలి ప్యాడ్, కాన్వాయ్, కాన్వాయ్ లో బందోబస్తు, రూట్ బందోబస్తు, మీటింగ్ ప్లేస్, ఎంట్రీ పాయింట్స్, ఎగ్జిట్ పాయింట్స్, పార్కింగ్, ట్రాఫిక్, బాంబు స్క్వాడ్ బృందాలు అన్నింటితో 700 మంది పోలీసు సిబ్బందిని మోహ‌రించారు.

టూవీలర్ పార్కింగ్ రామ్ లీలా మైదానం, స్థానిక సైన్స్ డిగ్రీ కళాశాల, ఆటోలు కార్ల పార్కింగ్ ప్రదేశం డైట్ కళాశాల మైదానం. భారీ వాహనాలు, బస్సులకు తిరుమల పెట్రోల్ బంక్ ఎదురు నుంచి మావల పోలీస్ స్టేషన్ మీదుగాతెలంగాణ ట్రైబల్ రెసిడెన్షియల్ బాయ్స్ కళాశాలలో పార్కింగ్ చేసేలా ఏర్పాట్లు చేశారు. పట్టణంలో ట్రాఫిక్ డైవర్షన్స్ చేప‌ట్టారు. అంకోలి, తంతోలి ప్రజలు కె ఆర్ కె కాలనీ మావల పోలీస్ స్టేషన్ మీదుగా పట్టణంలోనికి చేరుకుంటారు. ఆర్ ఆర్ నగర్ హ్యాండీక్యాప్ కాలనీ ప్రజలు మాల పోలీస్ స్టేషన్ మీదుగా పట్టణంలోనికి వ‌స్తారు.

ఇద్దరు అదనపు ఎస్పీలు, ఏడుగురు డిఎస్పీలు, 20 మంది సీఐలు, 50 మంది ఎస్ఐలు, 350 మంది కానిస్టేబుల్స్, 60 మంది మహిళా సిబ్బంది, 40 స్పెషల్ పార్టీ పోలీసు సిబ్బంది, సాయుధ పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వ‌హించ‌నున్నారు. ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా బందోబ‌స్తు ఏర్పాటు చేసిన‌ట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like