ఎమ్మెల్యేలు, నేతలపై సీఎం సీరియస్
Chief Minister Revanth Reddy:సర్పంచ్ ఎన్నికల్లో కొందరి వ్యవహార శైలి వల్ల అనుకున్నన్ని సీట్లు సాధించలేకపోయామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా నియోజకవర్గ ఇన్‌చార్జీలు, ఎమ్మెల్యేల వ్యవహార శైలి వల్ల పార్టీకి నష్టం జరిగినట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొందరు ఎమ్మెల్యేలు, నేతలకు ముఖ్యమంత్రి క్లాస్ తీసుకున్నారు.
మూడు విడతలుగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు అధికార కాంగ్రెస్ పార్టీకి ఊహించిన దాని కంటే పెద్ద విజయాన్నే అందించాయి. అయితే, కొన్ని చోట్ల మాత్రం అనుకున్న ఫలితాలు రాలేదని భావించిన అధిష్టానం, ముఖ్యమంత్రి ఈ విషయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. సర్పంచ్ ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy), తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్(Telangana Congress Affairs In-charge Meenakshi Natarajan) టీపీసీసీ చీఫ్ బీ.మహేష్ కుమార్ గౌడ్(TPCC Chief Mahesh Kumar Goud) టెలికాన్ఫరెన్స్ ద్వారా ఈ సమీక్ష నిర్వహించారు.
పంచాయతీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించడంలో విఫలమైన వరంగల్, మహబూనగర్, నల్లగొండ ఉమ్మడి జిల్లాలకు చెందిన 18మంది ఎమ్మెల్యేలు, పలువురు నియోజకవర్గ ఇన్ చార్జీలపై ఈ సందర్బంగా సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తున్నది. సర్పంచ్ ఎన్నికల ఫలితాల గురించి 18 మంది ఎమ్మెల్యేల పని తీరుపై పీసీసీ అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. తిరుగుబాటు అభ్యర్థులను బుజ్జగించకపోవడం.. సొంత బంధువులకు టికెట్ ఇచ్చి పార్టీకి నష్టం చేశారంటూ సీరియస్ అయినట్టు తెలిసింది. భవిష్యత్‌లో ఇది రిపీట్ అయితే ఉరుకునేది లేదని సీఎం రేవంత్ రెడ్డి వారికి వార్నింగ్ ఇచ్చినట్లుగా సమాచారం.
ఎన్నికల సమయంలో పార్టీకి వ్యతిరేకంగా నిలబడిన రెబల్స్‌ను బుజ్జగించడంతో, వారిని సమన్వయం చేయడంలో దాదాపు 18 మంది ఎమ్మెల్యేలు విఫలమయ్యారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. దీని వల్ల ఓట్లు చీలి పార్టీకి తీరని నష్టం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు, ఎమ్మెల్యేలు సొంత బంధువులను అభ్యర్థులుగా నిలబెట్టడాన్ని అధిష్ఠానం తప్పుపట్టింది. అర్హులైన కార్యకర్తలను కాదని, బంధువులకు టికెట్ ఇవ్వడం పార్టీ నియమ నిబంనలకు విరుద్ధమని స్పష్టం చేసింది. నియోజకవర్గాల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన నేతలకు సీఎం హెచ్చరిక జారీ చేశారు. భవిష్యత్‌లో ఇలాంటివి రిపీట్ అయితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. పార్టీ క్రమశిక్షణకు లోబడి , నియమ నిబంధనలు పాటిస్తూ పని చేయాలని తమ వైఖరి మార్చుకోవాలని ఆదేశించారు.