టీ 20 భారత జట్టు ప్రకటన
T 20 World Cup 2026:వచ్చే ఏడాది జరిగే టీ 20 వరల్డ్‌కప్ 2026కు సంబంధించిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ప్రపంచ కప్ ఆడే టీమిండియాకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా, అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఈ మెగా టోర్నీ భారత్, శ్రీలంక వేదికగా జరగనుంది. అయితే అనూహ్యంగా ఈ జట్టులో జట్టు వైస్ కెప్టెన్ శుభమన్ గిల్ కు జట్టులో స్థానం దక్కలేదు.
ప్రపంచ కప్ మ్యాచ్‌లు 7 ఫిబ్రవరి 2026 నుంచి ప్రారంభం కానున్నాయి. ఫైనల్ మ్యాచ్ మార్చి 8న జరగనుంది. భారత గ్రూప్ స్టేజిలో తన తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 7న యూఎస్ఏతో ముంబై వేదికగా ఆడనుంది. ఇదే రోజు పాకిస్థాన్ , నెదర్లాండ్స్ మధ్య కూడా మ్యాచ్ జరగుతుంది. భారత్ గ్రూప్ స్టేజ్ లో తన చివరి మ్యాచ్ ఫిబ్రవరి 12న నమీబియాతో ఆడుతుంది. ఫిబ్రవరి 15న కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియం వేదికగా టీమిండియా, పాకిస్థాన్ తలపడనున్నాయి. అనంతరం ఫిబ్రవరి 18న నెదర్లాండ్స్‌తో భారత జట్టు పోటీ పడుతుంది. ఫిబ్రవరి 21 నుంచి, మార్చి 1 వరకు సూపర్ 8 మ్యాచ్‌లు జరుగుతాయి. మార్చి 4న మొదటి సెమీఫైనల్, మార్చి 5న రెండో సెమీఫైనల్ జరుగుతుంది.
భారత జట్టు:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్)
అక్షర్ పటేల్ ( వైస్ కెప్టెన్)
సంజూశాంసన్ (వికెట్ కీపర్)
అభిషేక్ శర్మ
తిలక్ వర్మ
హార్దిక్ పాండ్య
శివమ్ దూబె
రింకు సింగ్
బుమ్రా
అర్షదీప్ సింగ్
హర్షిత్ రాణా
వాషింగ్టన్ సుందర్
ఇషాన్ కిషన్
కుల్దీప్ యాదవ్
వరుణ్ చక్రవర్తి