మెడికల్ హెల్త్ కేర్ కోఆర్డినేటర్‌గా రాజ్‌కుమార్

మెడికల్ హెల్త్ కేర్ మంచిర్యాల జిల్లా కోఆర్డినేటర్‌గా కొత్త‌ప‌ల్లి రాజ్‌కుమార్ ను నియ‌మించారు. డాక్టర్స్ సెల్, మెడికల్ & హెల్త్ వింగ్‌కు మంచిర్యాల జిల్లా కో ఆర్డినేటర్‌గా ఆయ‌న నియామ‌కం తక్షణమే అమ‌లులోకి వ‌స్తుంద‌ని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ కేర్ స్టేట్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ వెల్ల‌డించారు. రాజ్‌కుమార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి, తెలంగాణ పీసీసీ అధ్య‌క్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వాన్ని నిలబెట్టడానికి నిరంతరం కృషి చేస్తారని ఆశిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు అదే స‌మ‌యంలో ప్రజా ఆరోగ్యాన్ని బలోపేతం చేయడానికి మరింతగా తోడ్పడతారని ఈ బాధ్యతలని కొత్తపల్లి రాజ్ కుమార్ (శ్యామ్) కి బాధ్యతలు ఇస్తున్నట్లు స్ప‌ష్టం చేశారు.

You might also like