ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పిస్తాం
మంచిర్యాల నగరంలో నూతన రహదారులు నిర్మించి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పిస్తామని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు స్పష్టం చేశారు. మంచిర్యాలలో రాళ్లవాగుపై రూ. 23 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులను ఎమ్మెల్యే మేయర్ దర్ని మధుకర్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచిర్యాలలో సుమారు రూ. 225 కోట్లతో బ్రిడ్జి, నూతన రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నామన్నారు. లక్ష్మి నగర్ నుంచి రంగపేట, క్వారీ రోడ్డు నుండి అండాలమ్మ కాలనీ వరకు నాలుగు వరుసల రోడ్డు నిర్మాణం అక్కడి నుండి పాత మంచిర్యాల వరకు 6 లైన్ ల రోడ్ నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు.
ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడంతో రోడ్డు ప్రమాదాలను నివారిస్తున్నామని అన్నారు. సంవత్సరంలోపు ఈ రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సౌకర్యం కోసమే పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ, మంచిర్యాల నగర మేయర్ దర్ని మధుకర్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు , కార్పొరేటర్ తూముల నరేష్ , మంచిర్యాల జిల్లా INTUC అధ్యక్షులు పూదరి తిరుపతి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సల్ల మహేష్ తదితరులు పాల్గొన్నారు.