రోడ్డు ప్రమాదంలో ముగ్గురు కూలీలు మృతి
Road Accident: ఈ రోజు తెల్లవారు ఝామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. కాల కృత్యాలు తీర్చుకునేందుకు దిగిన కూలీలు చనిపోవడం విషాదాన్ని నింపింది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం జీఎం ఆఫీస్ – ఇందారం ఎక్స్ రోడ్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు కూలీలు చనిపోయారు. మహారాష్ట్ర నుంచి సుల్తానాబాద్ కు కూలీలతో బొలెరో వెళ్తోంది. ఇందారం వద్ద కాలకృత్యాల కోసం బొలెరను నిలిపివేశారు . దీంతో లారీ వెనకనుండి ఢీ కొట్టింది. దీంతో అక్కడిక్కడే ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఈ ముగ్గురు మహిళలే. ఈ ఘటనలో మరో 15 మందికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.