జాతీయ మెగా లోక్ అదాలత్ లో 4411 కేసులు పరిష్కారం
National Mega Lok Adalat:జాతీయ మెగా లోక్ అదాలత్ లో రామగుండం కమిషనరేట్(Ramagundam Commissionerate) పరిధిలో 4411 కేసులు పరిష్కారం అయినట్లు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా(Commissioner Amber Kishore Jha) తెలిపారు. ఇ-పెట్టీ కేసులు 2971, డ్రంక్ & డ్రైవ్ కేసులు 1038 పరిష్కారం అయ్యాయన్నారు. సైబర్ నేరాలకు సంబంధించి రామగుండం కమిషనరేట్ పరిధిలో 54 కేసులలో బాధితులకు రూ. 24,98,879, CCPS, పోలీస్ స్టేషన్ రామగుండంలో నమోదైన 05 కేసులలో బాధితులకు రూ. 28,25,226 ఇప్పించినట్లు స్పష్టం చేశారు. మొత్తం 59 సైబర్ నేరాలకు సంబంధించి బాధితులకు మొత్తం రూ.53,24,105 రిఫండ్ అయ్యాయని వెల్లడించారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారులు, కోర్టు సిబ్బంది 15 రోజుల నుండి కేసులలో ఉన్న కక్షిదారులను స్వయంగా కలిసి లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం జరుగుతుందని, ఇరు వర్గాలకు న్యాయం జరుగుతుందని అవగాహన కల్పించినట్లు తెలిపారు. అందుకే లక్ష్యానికి మించి కేసులు పరిష్కారం అయ్యాయన్నారు. ఈ సందర్భంగా కమిషనరేట్ అధికారులను సిబ్బందిని అభినందించారు. త్వరలో కోర్టు సిబ్బందికి, ప్రతిరోజు మానిటర్ చేసిన అధికారులకు, త్వరలో రివార్డ్స్ అందజేస్తామని తెలిపారు.