ఆర్థికంగా.. ఆదుకోండి..

క్ష‌ణికావేశంలో మందు తాగాడు… చికిత్స కోసం దాదాపు రూ. 12 ల‌క్ష‌ల వ‌ర‌కు ఖ‌ర్చు అవుతుంది… తండ్రి ఓ మామూలు డ్రైవ‌ర్‌.. త‌మ కుమారుణ్ని ఆదుకోవాల‌ని ఆ తండ్రి విజ్ఞ‌ప్తి చేస్తున్నాడు.. వివ‌రాల్లోకి వెళితే.. తాండూరు మండ‌లం మాదారం వడ్డెర కాలనీకి చెందిన‌ దేవాల రాజేష్ కుమారుడు ధ్రువ (14 సంవత్సరాలు) క్షణికావేశంలో క్రిమిసంహారక మందు తాగాడు. ఇప్పుడు అత‌ను ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ప్రస్తుతం హైదరాబాదులో ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. వారి తండ్రి డ్రైవర్ గా ప‌నిచేస్తున్నాడు. తల్లి కూలి పని చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ధ్రువ చికిత్సకు దాదాపు రూ. 12 లక్షలు ఖర్చవుతుందని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం వారి దగ్గర డబ్బులు లేవని దాతలు ముందుకు రావాల‌ని వారి తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. వారి ఫోన్ పే గూగుల్ పే నెంబర్ 9391230660..

Get real time updates directly on you device, subscribe now.

You might also like