మంచిర్యాల జిల్లాలో నాకాబందీ

మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీస్ అధికారులు ఒకేసారి నాకాబంది లో భాగంగా వాహనాలను తనిఖీలు నిర్వహించారు. జిల్లాలో అక్రమ రవాణా, నిషేధిత పదార్థాల రవాణా, సరైన పత్రాలు లేని వాహనాలను పట్టుకోవడానికి, గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా కార్యకలాపాలు జరగకుండా కట్టడి చేసేందుకు ఈ తనిఖీలు నిర్వహించిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. నాకాబందీ సమయంలో అనుమానిత వ్యక్తులు, అనుమానాస్పద వాహనాలను ఆపి సమగ్రంగా తనిఖీలు నిర్వహించారు.

వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ వంటి ధ్రువ పత్రాలను పరిశీలించారు. డ్రంక్ అండ్ డ్రైవింగ్, రాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్,హెల్మెట్ లేని వారు, వాహన ధ్రువ పత్రాలు లేని వారిపై పోలీస్ అధికారులు కేసులు నమోదు చేసి, జరిమానా విధించారు. ఈ సంద‌ర్భంగా వారికి రోడ్డు సేఫ్టీ, ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించారు. మంచిర్యాల జోన్ లో శాంతి భద్రతల పరిరక్షణ, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిరోధించేందుకే ఈ నాకాబందీ నిర్వ‌హించిన‌ట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా ఇలాగే నాకాబందీ నిర్వహించి, తనిఖీలు నిరంత‌రం కొన‌సాగిస్తామ‌ని మంచిర్యాల జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like