సమ్మె చేస్తం… చ‌ర్చ‌ల్లో పాల్గొంటం..

నాంది న్యూస్‌తో టీబీజీకేఎస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మిర్యాల రాజిరెడ్డి

ఆర్ఎల్‌సీ సమక్షంలో సింగరేణి యాజమాన్యంతో బుధ‌వారం జరిగిన చర్చలు విఫలమైనట్లు టీబీజీకేఎస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మిర్యాల రాజిరెడ్డి స్ప‌ష్టం చేశారు. ఆయ‌న `నాందిన్యూస్‌`తో మాట్లాడారు. టీబీజీకేఎస్‌తో స‌హా ఐదు జాతీయ కార్మిక సంఘాలు బొగ్గు బ్లాక్‌లు సింగ‌రేణికే ఇవ్వాలనే డిమాండ్‌తో పాటు మిగ‌తా వాటిపై గురువారం నుంచి స‌మ్మెకు వెళ్తున్న‌ట్లు వెల్ల‌డించారు. తాము స‌మ్మెకు వెళ్తున్నామ‌ని తెలిసి చ‌ర్చ‌ల‌కు పిలిచార‌ని అయితే త‌మ డిమాండ్లు తీర్చ‌క‌పోవ‌డంతో స‌మ్మె ఖ‌చ్చితంగా చేసి తీరుతామ‌న్నారు. గురువారం చ‌ర్చ‌లు ఉన్నా స‌మ్మె చేస్తూనే చ‌ర్చ‌ల్లో పాల్గొంటామ‌ని రాజిరెడ్డి స్ప‌ష్టం చేశారు. ప్రధానంగా సింగరేణికి చెందిన 4 బొగ్గు బ్లాక్లు సింగరేణికే ఇవ్వాలనే డిమాండ్ సాధనకు ఆర్ఎల్‌సీ ఎలాంటి హామీ ఇవ్వ‌లేద‌న్నారు. కార్మిక సోదరులు రేపటి నుండి జరగబోయే 72 గంటల సమ్మె విజయవంతం చేయాలని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు.

You might also like