పంట కాపాడుకునేందుకు వెళ్లి… నలుగురు రైతులు మృతి
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో విషాదం చోటుచేసుకుంది. ఈదురు గాలుల బీభత్సానికి రేకుల షెడ్డు కూలి నలుగురు రైతులు మృతి చెందారు. ధాన్యం పంటను కాపాడుకునే క్రమంలో ఒక్కసారిగా రేకుల షెడ్డు కుప్పకూలి నెల్కి లచ్చన్న, గుండారపు వెంకటేశ్, తనుగుల అభిరామ్, తనుగుల నాగరాజు మృతిచెందారు. సీదుల హరీశ్ పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో తండ్రీకుమారుడు తనుగుల అభిరామ్, తనుగుల నాగరాజు మృతిచెందడంతో బాధిత కుటుంబం కన్నీటిపర్యంతం అవుతోంది. అనంతరం క్షతగాత్రులను లక్షెట్టిపేట, కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు.