మోదీకి మాటిచ్చా..

అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్ వైరల్

Pawan Kalyan, Anna Lezhneva: నా భర్త (ప‌వ‌న్ క‌ళ్యాణ్‌) ఆరోగ్యంపై ప్రధాని మోదీ ప్రత్యేక శ్రద్ధ చూపించారు. ముందుగా ఆరోగ్యంపై ఫోకస్ చేయాలని, పూర్తిగా కోలుకున్నాకే తిరిగి పని ప్రారంభించాలని ప్రధాని మోదీ నా భర్తకు చెప్పారు. అలాగే ఆయన నన్ను చూసి.. ‘మీ భర్తను జాగ్రత్తగా చూసుకోండి’ అని అన్నారు. నేను అది ఎంతో సంతోషంగా చేస్తున్నాను. నా భర్తను జాగ్రత్తగా చూసుకుంటానని ప్రధాని మోదీకి మాటిచ్చాన‌ని అంటూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ భార్య‌ అన్నా లెజినోవా వెల్ల‌డించారు.

ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత ప‌వ‌న్ క‌ళ్య‌ణ్ ఇటీవల సైనస్ శస్త్రచికిత్స చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రధాని న‌రేంద్ర మోదీ పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. పవన్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకోవడంతో పాటు కొంతసేపు కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన మోదీ, ముందు ఆరోగ్యంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని సూచించినట్లు సమాచారం. ఆరోగ్యం పూర్తిగా కుదుటపడిన తర్వాతే తిరిగి పనుల్లోకి రావాలి అని పవన్‌కు ప్రధాని సూచించారు.

ఈ భేటీ అనంతరం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అన్నా లెజినోవా ప్రత్యేక పోస్టు పెట్టడం ఇప్పుడు మరింత వైరల్ అవుతోంది. ప్రధాని మోదీతో దిగిన ఫోటోలను షేర్ చేసిన ఆమె, తన భర్త ఆరోగ్యంపై ప్రధాని ప్రత్యేక శ్రద్ధ చూపారని పేర్కొన్నారు. ఆమె పెట్టిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు ఆమె పోస్టుపై స్పందిస్తూ పవన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. మరోవైపు ప్రధాని మోదీ పవన్ ఇంటికి వెళ్లి పరామర్శించడం రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like