రోడ్డు విస్తరణ కూల్చివేతల్లో ఉద్రిక్తత….
రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా రెండు పార్టీ ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.. అది కాస్త ఉద్రిక్తతకు దారి తీసింది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలో కొద్ది రోజులుగా రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. పట్టణంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జి పక్కన పనులు సాగుతుండగా, కాంగ్రెస్, బీఅర్ఎస్ నేతల మధ్య గొడవ మొదలయింది. బీఆర్ఎస్.. కాంగ్రెస్ కౌన్సిలర్లు నాయకుల మధ్య మాటా మా టా పెరిగి ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.
తమ నాయకున్ని దూషించిన బీఆర్ఎస్ నాయకులపై అట్రాసిటీ కేసు పెట్టాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నాయకులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నాయకులు, కౌన్సిలర్లు ప్రధాన రోడ్డుపై బైఠాయించారు.