సింగరేణి మెడికల్ బోర్డు పునరుద్ధరణ !!
INTUC సెక్రటరీ జనరల్ బి. జనక్ ప్రసాద్ వెల్లడి
మెడికల్ బోర్డు పునరుద్ధరణ.. గత రెండు బోర్డులపై రివ్యూ నిర్వహించేందుకు యాజమాన్యం హామీ ఇచ్చిందని INTUC సెక్రటరీ జనరల్ బి. జనక్ ప్రసాద్ వెల్లడించారు. సింగరేణి కార్మికుల్లో ఇటీవల నెలకొన్న అనిశ్చితి పరిస్థితులపై జనక్ ప్రసాద్ నాయకత్వంలో INTUC ముఖ్య నేతల బృందం హైదరాబాద్లో పలువురు మంత్రులు, ఉన్నతాధికారులతో చర్చలు జరిపింది. ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ,ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ,మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వెం నరేందర్ రెడ్డిని కలిసి సింగరేణి కార్మికుల సమస్యలను వివరించారు. అనంతరం సింగరేణి సీఎండీ జ్యోతి బుద్ధ IAS మరియు డైరెక్టర్ (PAW) గౌతమ్ పోట్రుతో కూడా సమావేశమై పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు.
గతంలో మాదిరిగానే మెడికల్ బోర్డు నిర్వహణ కొనసాగించడం.. గతంలో జరిగిన రెండు మెడికల్ బోర్డులపై రివ్యూ నిర్వహించాలి. కార్మికుల PERKS పై విధిస్తున్న ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయాలి. సొంత ఇంటి పథకం అమలు చేయాలి. ట్రైనింగ్ పూర్తి చేసిన అభ్యర్థులకు నియామక పత్రాల పంపిణీ చేయాలి.. మారుపేర్ల మార్పు.. డిస్మిస్ అయిన కార్మికుల సమస్యల పరిష్కారం.. నూతన బొగ్గు గనులు ప్రారంభించాలి. విజిలెన్స్ కేసుల పరిష్కారం, పెండింగ్ బకాయిల చెల్లింపు తదితర అంశాలపై యాజమాన్యం సానుకూలంగా స్పందించినట్లు జనక్ ప్రసాద్ తెలిపారు. కార్మికుల PERKS పై ఇన్కమ్ ట్యాక్స్ మాఫీ విషయాన్ని కూడా సానుకూలంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
సొంత ఇంటి పథకం అమలుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి ప్రభుత్వంతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని యాజమాన్యం హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశాల్లో INTUC సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు నరసింహ రెడ్డి, ధర్మపురి, కాంపెల్లి సమ్మయ్య, త్యాగరాజన్, జెట్టి శంకర్ రావు, జనరల్ సెక్రటరీ వికాస్ కుమార్ యాదవ్ , చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నరేందర్, వైస్ ప్రెసిడెంట్లు దాస్ , కోట రవీంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు