బ్రేకింగ్ న్యూస్‌.. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు నరహరి లొంగుబాటు

Maoist Leader Pasunuri Narahari Surrendered: మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి అలియాస్ సంతోష్ అలియాస్‌ పోలీసుల ఎదుట లొంగిపోయారు. 45 ఏళ్లుగా అజ్ఞాత జీవితంలో ఉన్న ఆయన తన భార్యతో కలిసి ఆయన పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. మావోయిస్టు పార్టీలో ప్రస్తుతం ఆయన జార్ఖండ్ ఈస్ట్ రీజినల్ బ్యూరో టెక్నికల్ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వరిస్తున్నాడు.

హనుమకొండ జిల్లా కాజీపేట మండలం సోమిడి గ్రామానికి చెందిన పసునూరి సోమనారాయణ-నర్సమ్మ దంపతులకు నరహరి రెండో కుమారుడు. 1980లో ఎల్‌బీ కాలేజీలో డిగ్రీ చదువుతుండగా నక్సల్ విధానాలకు నరహరి ఆకర్షితులయ్యాడు. అప్పటి రాష్ట్ర కార్యదర్శి పులి అంజయ్య, క్రాంతి రణదేవ్ అలియాస్ బక్కన్నతో ఏర్పడిన స్నేహం కారణంగా ఆయన మావోయిస్టు ఉద్యమం వైపు అడుగులు వేశారు. కూలీల రేట్లు పెంచడంతో పాటు భూస్వాములు, రౌడీలకు వ్యతిరేకంగా అప్పట్లో పోరాటం చేశాడు. అనంతరం అడవి బాట పట్టాడు. 1996 నుంచి ఆయన అజ్ఞాతంలోనే ఉన్నాడు.

పార్టీలో టెక్నికల్ వింగ్, మిలిటరీ ఆపరేషన్లలో ఆరితేరిన ఆయన, ఇటీవల కేంద్ర కమిటీ (CC) సభ్యుడిగా పదోన్నతి పొందారు. పేలుడు పదార్థాల తయారీ, వ్యూహరచన వంటి అంశాల్లో ఆయనకు ఉన్న పట్టు దృష్ట్యా పార్టీలో ఆయనను అత్యంత కీలక నేతగా పరిగణించేవారు. నరహరిపై తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ వంటి పలు రాష్ట్రాల్లో కలిపి భారీ మొత్తంలో రివార్డు కూడా ఉంది. ఇన్నాళ్లూ అడవిలో ఉంటూ సాంకేతిక విభాగాన్ని నడిపించిన నరహరి లొంగుబాటు మావోయిస్టు పార్టీకి పెద్ద దెబ్బగానే భావిస్తున్నారు. ప్రస్తుతం మావోయిస్టు అగ్ర నాయకత్వంలో వయసు పైబడటం, అనారోగ్య సమస్యలు తలెత్తడం, మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Get real time updates directly on you device, subscribe now.

You might also like