నిందితుల‌ను క‌ఠినంగా శిక్షించాలి..

-మంచిర్యాలలో కాంగ్రెస్ ధర్నా..
-నీట్ పేపర్ లీక్‌పై ఆగ్రహం

Congress:కేంద్ర ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం వ‌ల్ల‌నే నీట్ ప‌రీక్షా ప‌త్రం లీక్ అయ్యింద‌ని మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తూముల నరేష్, మేయర్ దర్ని మధుకర్ దుయ్య‌బ‌ట్టారు. నీట్ పరీక్షా పేపర్ లీకేజ్ నిరసిస్తూ గురువారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంచిర్యాల ఐబీ చౌరస్తా వద్ద ధర్నా నిర్వ‌హించారు. ఈ సందర్భంగా మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తూముల నరేష్, మేయర్ దర్ని మధుకర్ మాట్లాడుతూ పేపర్ లీక్ విషయంలో మోదీ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని దుయ్య‌బ‌ట్టారు. పేపర్ లీక్ చేసిన దోషులను వెంటనే క‌ఠినంగా శిక్షించాల‌ని డిమాండ్ చేశారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో కాంగ్రెస్ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

 

Get real time updates directly on you device, subscribe now.

You might also like