పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
Petrol, Diesel Prices Hiked: దేశవ్యాప్తంగా శుక్రవారం నాడు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ. 3 పెంచుతున్నట్లు ఆయిల్ కంపెనీలు వెల్లడించాయి.పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి వచ్చాయి. కొంతకాలంగా స్థిరంగా ఉంటూ వస్తున్న ఇంధన ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి.
కొన్ని రోజులుగా పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (Crude Oil) ధరలు పెరగడం వల్ల దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. లీటర్ పెట్రోల్‌పై 3 రూపాయలు, డీజిల్‌పై 3 రూపాయలు పెరిగింది. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వచ్చాయి. ముడి చమురు ధరల పెరుగుదల… రూపాయి విలువ క్షీణించడంతో చమురు సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. తాజా ధరలు పెంపు తర్వాత ఢిల్లీలో సాధారణ పెట్రోల్ ధర లీటరుకు సుమారుగా రూ.97.77కు చేరగా, డీజిల్ ధర లీటరుకు రూ.90.67కు చేరింది. మరోవైపు, ప్రీమియం పెట్రోల్ ధర ఇప్పుడు లీటరుకు రూ.104.88గా ఉంది.
హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.110.50, డీజిల్ రూ.98.70కి చేరగా, కోల్‌కతాలో ఇది లీటరు పెట్రోల్ రూ.108.74కు, డీజిల్ రూ.95.02, ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.106.68, డీజిల్ రూ.93.03కి చేరింది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.103.67, డీజిల్ రూ.95.39కి చేరింది. ఇరాన్, అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో భారత్ పై నేరుగా ప్రభావం పడుతోంది. పెరిగిన ధరలు కూడా ఈరోజు మే 15వ తేదీ శుక్రవారం ఉదయం 6 గంటల నుండి అమలులోకి వస్తాయని ప్రకటించాయి.