వరి ధాన్యం ప్రక్రియ వేగవంతం చేయాలి
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
వరి ధాన్యం ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లాలోని తాండూర్ మండల కేంద్రంలోని ధాన్యం గోదాం మండల తహసిల్దార్ జ్యోత్స్న తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందన్నారు. వారికి మద్దతు ధర చెల్లించి రైతుల నుంచి నాణ్యమైన ధాన్యం కొనుగోలు చేస్తోందన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేటాయించిన ప్రకారం రైస్ మిల్లులకు, గోదాములకు తరలించాలని తెలిపారు. గోదాములకు తరలించిన ధాన్యాన్ని నిబంధనల ప్రకారం నిల్వ చేయాలన్నారు.