అనుమతులు లేకుండా మట్టి తరలింపు.. సీజ్ చేసిన కలెక్టర్
సరైన అనుమతులు లేకుండా ఇసుక, మట్టి తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె. హరిత అన్నారు గురువారం కాగజ్నగర్ మండలం గన్నారం మాండవ, ఆరెగూడ, అనుకొడ గ్రామాలలో చెరువులను పరిశీలించారు. నజ్రుల్ నగర్ విలేజ్ నెం.12 గ్రామ పరిధిలో మట్టిని తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను తనిఖీ చేశారు. తనిఖీలో సంబంధిత వ్యక్తుల వద్ద ఎలాంటి అనుమతులు లేదా సంబంధిత పత్రాలు లేవని గుర్తించడంతో ఆ ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎవరైనా అక్రమంగా మట్టి, ఇసుక తరలిస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మట్టి, ఇసుక రవాణా చేపట్టే ముందు సంబంధిత శాఖల నుంచి అవసరమైన అనుమతులు తీసుకోవాలన్నారు. ఆ తర్వాతే తరలించాలన్నారు కార్యక్రమంలో కాగజ్నగర్ మండల తహసీల్దార్ మధుకర్, రెవెన్యూ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.