వర్షాలకు చిన్న విరామం.. 19 తర్వాత మళ్లీ జోరు

Southwest Monsoon 2026: ముందస్తుగా పలకరించిన నైరుతి రుతుపవనాలు ‘చిన్న విరామం’ తీసుకున్నాయి. ప్రతికూల వాతావరణం కారణంగా రుతుపవన గమనం మందగించింది. దీంతో వర్షాలు పడకపోగా, వాతావరణం మళ్లీ వేడెక్కింది. రుతుప‌వ‌నాలు ద‌క్షిణ తెలంగాణ‌, హైద‌రాబాద్ వ‌ద్దే నిలిచిపోనున్నాయి. ఈ నేప‌థ్యంలో ఈ నెల 17 వ‌ర‌కు వాతావ‌ర‌ణం ఎండ‌లు, ఉక్క‌పోత పెర‌గ‌నుంది. అయితే, ఎండ‌ల కార‌ణంగా అక్క‌క‌క్క‌డా వాతావ‌ర‌ణం మేఘావృత‌మై ఉరుములు, మెరుపుల‌తో చెదురుమ‌దురు వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు చెబుతున్నారు.

ఈ నెల 18 త‌ర్వాత వాతావ‌ర‌ణ చ‌ల్ల‌బ‌డుతుంద‌ని, అప్ప‌టికి బంగాళాఖాతంలో అల్ప‌పీడ‌నం ఏర్ప‌డ‌నుంది. దీని ప్ర‌భావంతో 19 నుంచి 23 మధ్య‌లో రుతుప‌వ‌నాలు పుంజుకుని విస్తారంగా వ‌ర్షాలు ప‌డ‌నున్నాయి. ఇదేమీ అనూహ్యమైన పరిణామం కాదని, రుతుపవనాలు విస్తరించేటప్పుడు మధ్యలో కొన్నిరోజుల విరామం సాధారణమేనని అధికారులు చెబుతున్నారు. నైరుతి రుతుపవనాలు విరామం తీసుకోవడంతో రాష్ట్రంలో సాధారణం కంటే రెండు మూడు డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని తెలిపారు. మరో వారంపాటు ఇదే పరిస్థితి కొనసాగుందని ఐఎండీ అధికారులు స్పష్టం చేశారు.

You might also like