నిఘా నీడలో నిమజ్జనం

-గణేష్ నిమజ్జనోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు
-రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గణేష్ నిమజ్జన మహోత్సవాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ భద్రతా చర్యలు చేపట్టినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు చోటుచేసుకోకుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

-మంచిర్యాల జోన్ పరిధిలో ఏసీపీలు- 03 , సీఐ/ఆర్ ఐ లు-11, ఎస్ఐ/ఆర్ఎస్ఐలు -26.., ఏఎస్సై,/హెడ్ కానిస్టేబుళ్లు-67, పోలీస్ కాని స్టేబుల్-90, మహిళా కానిస్టేబుళ్లు-17, హోంగార్డ్స్-.30, స్పెషల్ పార్టీ సిబ్బంది,10 మంది,

-పెద్దపల్లి జోన్ పరిధిలో ఏసీపీలు- 04, సీఐ/ఆర్ ఐ లు-15, ఎస్ఐ/ఆర్ఎస్ఐలు – 25, ఏఎస్సై,/హెడ్ కానిస్టేబుళ్లు-26, పోలీస్ కాని స్టేబుల్-81, మహిళా కానిస్టేబుళ్లు-14, హోంగార్డ్స్-30… ఏఆర్, స్పెషల్ పార్టీ సిబ్బంది -25.

-రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో ఏసీపీలు 07 , సీఐ/ఆర్ ఐ లు-26, ఎస్ఐ/ఆర్ఎస్ఐలు -51.., ఏఎస్సై,/హెడ్ కానిస్టేబుళ్లు-93, పోలీస్ కాని స్టేబుల్-171 , మహిళా కానిస్టేబుళ్లు-31.. , హోంగార్డ్స్-.50, స్పెషల్ పార్టీ సిబ్బంది.35 , ఎన్ ఎస్,ఎస్, ఎన్ సీసీ క్యాడెట్లు-.,ఎస్ఆండ్ పీసీ సిబ్బంది తో కలిపి సుమారు 500 మందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామ‌న్నారు.

-రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 5,189 వినాయక విగ్రహాలను ఏర్పాటు చేశారని…. ఇందులో పెద్దపల్లి జోన్ పరిధిలో 2,659, మంచిర్యాల జోన్ పరిధిలో 2,530 వినాయక విగ్రహాలు ఉన్నాయని సీపీ వెల్ల‌డించారు.

-మంచిర్యాల జోన్ పరిధిలో 41 నిమజ్జన ప్రదేశాలను ఏర్పాటు చేశారు. గోదావరి బ్రిడ్జి, గూడెం బ్రిడ్జి, గోదావరి పుష్కర ఘాట్,లక్షెట్టిపేట, గౌతమేశ్వర టెంపుల్, మంచిర్యాల,ఇంటెక్ వెల్,సీతారాంపల్లి, గోదావరి ప్రవాహ ప్రాంతాలు,బెల్లంపల్లి పోచమ్మ చెరువు, చెన్నూరు పెద్దచెరువు, సాలిగాం ప్రాజెక్టు, సల్పాల వాగు తదితర ప్రాంతాల్లో వినాయక విగ్రహాల నిమజ్జనం నిర్వహించనున్నారు.

-పెద్దపల్లి జోన్ పరిధిలో 36 నిమజ్జన ప్రదేశాలను ఏర్పాటు చేశారు. గోదావరి బ్రిడ్జి, గోలివాడ,మంథని గోదావరి ప్రాంతాలు, పెద్దపల్లి ఎల్లమ్మ చెరువు,మినీ ట్యాంక్ బండ్,సుల్తానాబాద్ చెరువు, హుస్సేన్‌మియా వాగు,మానేరు వాగు తదితర ప్రాంతాల్లో వినాయక విగ్రహాల నిమజ్జనం నిర్వహించనున్నారు.

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో రోడ్ల మరమ్మతులు, ఫ్లడ్ లైట్లు, క్రేన్లు, ప్లాట్‌ఫారాలు, మంచినీటి వసతి తదితర ఏర్పాట్లు పూర్తి చేశారు. నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో గజ ఈతగాళ్లను సైతం అందుబాటులో ఉంచారు. అన్ని నిమజ్జన ప్రాంతాలను సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షించనున్నారు. నిమజ్జన శోభాయాత్రను డ్రోన్ కెమెరాలతో కూడా పర్యవేక్షిస్తారు. ఎక్కడైనా ట్రాఫిక్ సమస్య ఏర్పడినా, శోభాయాత్రలో వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగినా వెంటనే చర్యలు తీసుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

గణేష్ ఉత్సవ కమిటీలు వీలైనంత త్వరగా పూజా కార్యక్రమాలను ముగించి, వెలుతురు ఉన్న సమయంలోనే విగ్రహాలను జాగ్రత్తగా నిమజ్జన ప్రదేశాలకు తరలించాలని సీపీ సూచించారు. శోభాయాత్రలో చిన్నారులు, మహిళలు పాల్గొన్నప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.ట్రాక్టర్లు,లారీలు,ఇతర వాహనాలపై ప్రయాణించే చిన్నారులు ప్రమాదాలకు గురికాకుండా నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

నిమజ్జనం సమయంలో పోలీసుల సూచనలను ఉత్సవ నిర్వాహకులు, కమిటీ సభ్యులు తప్పనిసరిగా పాటించాలని, పోలీసులకు సహకరించి నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా పూర్తి చేయాలని సీపీ కోరారు.
నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా డీజేలు వినియోగించడం, బాణాసంచా కాల్చడం నిషేధం అని తెలిపారు. చట్టవిరుద్ధంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

భక్తిశ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాలను ముగించుకుని నిర్వహించే గణేష్ నిమజ్జన కార్యక్రమం మతసామరస్యానికి ప్రతీకగా, ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించాలని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా విజ్ఞప్తి చేశారు.

You might also like