INTUC మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా పూదరి తిరుపతి
కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఐఎన్టియుసి (INTUC) మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా పూదరి తిరుపతి నియామకమయ్యారు. నియామక పత్రాన్ని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చేతుల మీదుగా అందుకున్నారు. పుదారి తిరుపతి మాట్లాడుతూ తనపై నమ్మకంతో మంచిర్యాల ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షునిగా నియమించిన ఐఎన్టియుసి జాతీయ అధ్యక్షులు సంజీవరెడ్డి, మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు, ఐఎన్టీయూసీ స్టేట్ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
కార్మికుల హక్కుల కోసం కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కార్మిక సంఘం అయిన ఐఎన్టియుసి బలోపేతం కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తానని స్పష్టం చేశారు.