జాతీయ ర‌హ‌దారిపై గ్రామ‌స్తుల ఆందోళ‌న

త‌మ గ్రామం నుంచి మ‌ట్టి త‌ర‌లించి… రోడ్డును స‌ర్వ‌నాశ‌నం చేశార‌ని ఇప్పుడు ప‌ట్టించుకోవ‌డం లేదంటూ జాతీయ‌ర‌హ‌దారిపై గ్రామ‌స్తులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి నిర‌స‌న వ్య‌క్తం చేయ‌డంతో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది…

కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా(Komaram Bheem Asifabad District) వాంకిడి మండలం గణేశాపూర్ వ‌ద్ద‌ జాతీయ రహదారిపై సోనాపూర్ గ్రామస్థులు రాస్తారోకో నిర్వహించారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళనలో పాల్గొనడంతో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 2021లో డీబీఎల్ సంస్థ(DBL Company) మట్టి తరలించింద‌ని, దాని కారణంగా దెబ్బతిన్న సోనాపూర్ బీటీ రోడ్డును ఇప్పటికీ మరమ్మతు చేయలేదని గ్రామస్థులు ఆరోపించారు. గణేశాపూర్ వద్ద బస్టాండ్, సర్వీస్ రోడ్లు, డ్రైనేజీ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని గ్రామస్థులు హెచ్చరించారు. అధికారులు స్పందించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.

You might also like