రేపటి నుంచి కవిత బాయిబాట
Kalvakuntla Kavitha: సింగరేణి బాయి బాట పేరుతో కల్వకుంట్ల కవిత రేపటి నుంచి కోల్ బెల్ట్ లో పర్యటించనున్నారు. మొదటి రోజు మంచిర్యాల జిల్లా పర్యటనకు రానున్నారు ఉదయం 7 గంటలకు మందమర్రి ఏరియా కాసిపేట 1 గని పై సమావేశం నిర్వహిస్తారు. ఉదయం 9.30కు మంచిర్యాల పట్టణంలో విలేకరుల సమావేశంలో పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు బెల్లంపల్లి పట్టణం లో తిలక్ స్టేడియం దగ్గర పార్టీ జెండా ఆవిష్కరిస్తారు.
అనంతరం 12 గంటలకు ఆసిఫాబాద్ లో పార్టీ జెండా ఆవిష్కరిస్తారు. అక్కడే జిల్లా కార్యాలయం ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1.30కి ఇంద్రవెల్లిలో అమరుల స్థూపానికి నివాళులు అర్పిస్తారు. 2 గంటలకి కేస్లాపూర్ నాగోబా ఆలయాన్ని సందర్శిస్తారు. సాయంత్రం 4. 30 గంటలకు లక్షేట్టి పేటలో TRS జెండా పండుగ లో పాల్గొంటారు.