స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌గా రమేష్

మంచిర్యాల జిల్లా స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్‌గా మంచిర్యాల‌కు చెందిన సమిడ్ల రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు (ROC No.157/SO/2025) ఆదేశాలు జారీ చేసింది. ఈ నియామకం ఏడాది పాటు ఉంటుంది. ఆ తర్వాత దానిని పొడిగించే అవకాశం ఉంటుంది. రమేష్ 20 ఏండ్లుగా మంచిర్యాలలో లాయర్ గా సేవలందిస్తున్నారు. మేజిస్ట్రేట్‌గా సేవ‌లు అందించ‌డం త‌న‌కు ఆనందంగా ఉంద‌ని ర‌మేష్ వెల్ల‌డించారు.

You might also like