సింగరేణి చరిత్రలో కీలక ఘట్టం.. నైనీ బొగ్గు సరఫరా ప్రారంభం
ఒడిశాలోని నైనీ బ్లాక్ నుంచి బొగ్గు లోడుతో బయలుదేరిన తొలి గూడ్స్ రైలు రేపు ఉదయం 7 గంటలకు మంచిర్యాల జిల్లా జైపూర్ ఎస్టీపీపీ (STPP) థర్మల్ పవర్ ప్లాంట్ చేరుకోనుంది.
నైనీ బ్లాక్ నుంచి బొగ్గు సరఫరా ప్రారంభం కావడం సింగరేణి సంస్థకు కీలక మైలురాయిగా భావిస్తున్నారు. ఈ బొగ్గు సరఫరాతో జైపూర్ థర్మల్ పవర్ ప్లాంట్‌కు ఇంధన లభ్యత మరింత బలోపేతం కానుండగా, విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు సరఫరా మరింత స్థిరంగా కొనసాగనుంది.
గూడ్స్ రైలు ప్లాంట్‌కు చేరుకున్న అనంతరం నిర్వహించే కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్లు, ఎస్టీపీపీ అధికారులు, కార్మిక సంఘాల నాయకులు, ఇతర ప్రముఖులు పాల్గొననున్నారు. తొలి బొగ్గు రేక్ రాకను పురస్కరించుకుని ప్రత్యేకంగా స్వాగత కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.