షార్జా ప్రమాద బాధితుడికి కేటీఆర్ అండ

షార్జాలో బైక్ ప్ర‌మాదానికి గురైన ఓ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండ‌గా నిలిచారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నర్సాపూర్‌కు చెందిన నరెడ్ల సతీష్ (40) షార్జాలో బైక్ ప్రమాదానికి గురయ్యారు. కుటుంబ పోషణ కోసం రెండేళ్లుగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో బైక్ డ్రైవర్‌గా పనిచేస్తున్న సతీష్.. జూలై 29న షార్జాలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. అత‌న్ని ఆసుపత్రి అత్యవసర విభాగానికి తరలించి చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. సతీష్ కుటుంబానికి అండగా నిలిచారు. ఆసుపత్రి ఖర్చులు చెల్లించడంతో పాటు, సతీష్‌ను చికిత్స అనంతరం తెలంగాణకు తీసుకొచ్చేందుకు ఫ్లైట్ టికెట్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర నాయకుడు విజిత్ రావు నర్సాపూర్‌లో సతీష్ భార్య భవాని, తండ్రి రామన్నతో కలిసి కేటీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడించారు. సతీష్ కుటుంబ సభ్యులకు కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఆసుపత్రిలో చెల్లించాల్సిన మొత్తాన్ని ఇప్పటికే చెల్లించామని, సతీష్‌ను త్వరగా తెలంగాణ తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

ఫోన్ లో కేటీఆర్ సంభాషణ..

​కేటీఆర్: “నమస్తే అమ్మ, నేను కేటీఆర్‌ని.”

​బాధితుడి భార్య : “సార్.. నమస్తే సార్.”

​కేటీఆర్: “నమస్తే అమ్మ. నాతో విజిత్ చెప్పిండు, మీ గురించి.. మీకు సమస్య వచ్చింది అని చెప్పిరు. తప్పకుండా వెంటనే పార్టీ నుంచి మొత్తం అన్ని అరేంజ్మెంట్లు చేసి, పేమెంట్ అంతా చేసి తెప్పించేస్తామమ్మా.” “సారీ అమ్మ మీకు..ఎంత తొందరగా అయితే అంత తొందరగా చేసి.. తొందర్లోనే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం తల్లి.”

​బాధితుడి భార్య : “సార్.. కొంచెం తొందరగా చేయండి సార్.. బాగా ఇబ్బందిగా ఉంది సార్.”

​కేటీఆర్: “వస్తారమ్మా, వచ్చేస్తారు. మీరేం వర్రీ కావాల్సిన అవసరం లేదు, వెంటనే వచ్చేస్తారు. ఆ డబ్బులు ఏమైనా కట్టాల్సింది ఉంటే కట్టేసినాము.. వచ్చేస్తారమ్మా.”

​బాధితుడి భార్య : “థాంక్యూ.. థాంక్యూ సార్.”

​కేటీఆర్: “రైట్ అమ్మ.. నమస్తే.

విజిత్: అన్న ఒక్క నిమిషం.. వాళ్ళ ఫాదర్ కూడా ఉన్నారు..

కేటీఆర్: ఆ ఆయనతో మాట్లాడతా..”
(ఫోన్ అందించిన తర్వాత)

బాధితుది ​తండ్రి: “హలో.. సార్ సార్, నమస్తే సార్.”

​కేటీఆర్: “నమస్తే అన్న. అది అభిజిత్ బాబు చెప్పిండు. నేను ఆల్రెడీ దివాకర్ రావు గారికి కూడా చెప్పానన్నా. నేను ఆల్రెడీ అక్కడ చేయాల్సింది అంతా చేసినాము.. వచ్చేస్తారు, వెంటనే వాళ్ళని ఇక్కడికి తెప్పించే ప్రయత్నం చేస్తాం. తొందరలోనే వచ్చేస్తారు.”

బాధితుది ​తండ్రి: “థాంక్యూ అన్న.. థాంక్యూ”
కేటీఆర్ భరోసాతో సతీష్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

You might also like