టమాట లోడుతో వెళ్తున్న వాహనం బోల్తా
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలం దేవాలగూడ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వాహనం బోల్తా పడింది. జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. కాగజ్‌నగర్‌కు టొమాటోలు తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో అందులో ఉన్న టామాటాలు మొత్తం రోడ్డుపై పడిపోయాయి. వాహనం రోడ్డుకు అడ్డంగా పడడంతో కాసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాహనాన్ని పక్కకు తీయించి రాకపోకలను క్రమబద్ధీకరించారు. మరో వాహనాన్ని తీసుకొచ్చి కిందపడిన టమాటాలను అక్కడి నుంచి తరలించారు.