వాచ్ మెన్ పై చర్యలు తీసుకోండి
కొమురం భీం జిల్లా జైనూర్ మండల కేంద్రంలోని పోచంలోద్ది కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో వాచ్మెన్పై విద్యార్థినులు ఆందోళనకు దిగారు. వాచ్మెన్ తమను అసభ్య పదజాలంతో దూషిస్తూ, లేనిపోని నిందలు వేస్తున్నారని ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థినులు ఆరోపించారు.
వాచ్ మెన్ పై వెంటనే చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థినులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. విద్యార్థినుల ఆందోళనతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని విద్యార్థినులు కోరారు.