మావోయిస్టు క్యాంప్ నుంచి… మోడలింగ్ ర్యాంప్ వరకు..
మారిన మాజీ మహిళా నక్సల్స్ జీవితం
నిన్నటి తుపాకీ..
నేటి చేనేత.
నిన్నటి అడవి..
నేటి ర్యాంప్.
నిన్నటి భయం..
నేటి ఆత్మవిశ్వాసం.
ఒకప్పుడు అడవుల్లో తుపాకీ పట్టిన చేతులు..
ఇప్పుడు అదే చేతులతో చేనేత వస్త్రాలు నేస్తున్నాయి.
ఒకప్పుడు పోలీసుల కళ్లుగప్పి అడవుల్లో తిరిగిన అడుగులు..
ఇప్పుడు అదే ఆత్మవిశ్వాసంతో ర్యాంప్పై అడుగులు వేస్తున్నాయి.
ఇది సినిమా కథ కాదు…. తిరుగుబాటు జీవితాన్ని వదిలి కొత్త జీవితాన్ని ఎంచుకున్న మాజీ మహిళా మావోయిస్టుల నిజ జీవిత ప్రయాణం….. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో జరిగిన కార్యక్రమం ఇందుకు వేదికైంది. బస్తర్ ప్రాంతానికి చెందిన మాజీ మహిళా మావోయిస్టులు సంప్రదాయ ఛత్తీస్గఢీ చేనేత వస్త్రాలను ధరించి ర్యాంప్పై క్యాట్వాక్ చేశారు.
కోసా పట్టు.. చేతితో నేసిన సంప్రదాయ వస్త్రాలు…. ఆభరణాల కంటే ఎక్కువగా కనిపించింది వారి ఆత్మవిశ్వాసం…. ఒకప్పుడు సంఘర్షణల మధ్య గడిచిన జీవితాలకు.. ఇప్పుడు ఇదో కొత్త అధ్యాయం…. మావోయిస్టు ఉద్యమంలో పనిచేసిన అనంతరం లొంగిపోయిన ఈ మహిళలు.. ప్రధాన స్రవంతి సమాజంలోకి తిరిగి వచ్చారు. చేనేతతో పాటు వివిధ రంగాల్లో తమకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతున్నారు.
రాయ్పూర్లోని పండిట్ దీన్దయాళ్ ఉపాధ్యాయ్ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో.. వారి ర్యాంప్ వాక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలోనూ వైరల్గా మారాయి. “కొన్ని సంవత్సరాల క్రితం ఇలాంటి దృశ్యాలను ఊహించడం కూడా కష్టం” అంటూ పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు.
కేవలం ర్యాంప్పై నడవడం కాదు…. గతాన్ని వెనక్కి వదిలి.. కొత్త జీవితంలోకి అడుగుపెట్టడం… అందుకే ఈ ర్యాంప్ వాక్ ఒక ఫ్యాషన్ షో కంటే ఎక్కువగా కనిపించింది.
ఇది మార్పుకు ఓ సంకేతం..
పునరావాసానికి ఓ నిదర్శనం..
కొత్త జీవితంపై ఓ నమ్మకం.
కార్యక్రమానికి హాజరైన ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి కూడా మాజీ మహిళా మావోయిస్టులతో మాట్లాడి.. వారి కొత్త ప్రయాణం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
అడవుల్లో తుపాకీతో మొదలైన ప్రయాణం..
చేనేత వస్త్రాలతో ర్యాంప్పైకి వచ్చింది.
ఇది కేవలం ఓ ర్యాంప్ వాక్ కాదు..
ఓ జీవిత పరివర్తనకు కనిపించిన కొత్త అడుగు.