క‌లెక్ట‌రేట్ ను ఇడియ‌ట్స్ న‌డిపిస్తున్న‌రు…

క‌లెక్ట‌రేట్‌ను ఇడియ‌ట్స్ న‌డిస్తున్నారంటూ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథరావు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. శ‌నివారం 22A నిషేధిత భూములపై బీజేపీ నాయ‌కులు క‌లెక్ట‌రేట్ వెళ్లారు. క‌లెక్ట‌ర్‌ను క‌లిసి విన‌తి ప‌త్రం అందించేందుకు ప్ర‌య‌త్నించ‌గా వారు లోప‌లికి వెళ్ల‌కుండా పోలీసులు గేట్లు మూసివేశారు. దీంతో మండిప‌డ్డారు. క‌లెక్ట‌ర్‌ను మూర్ఖుల గుంపు న‌డిపిస్తోందంటూ దుయ్య‌బ‌ట్టారు. క‌లెక్ట‌ర్ కు కాంగ్రెస్ పార్టీ జీతం ఇస్తోందా..? అంటూ ప్ర‌శ్నించారు. ఎప్పుడో బ‌దిలీ కావాల్సి ఉంద‌ని… ఇన్ని రోజులు ఒక్క‌చోటే ఇదే స‌మ‌స్య అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాము ధర్నాలు, నిర‌స‌న‌లు వ్య‌క్తం చేయ‌డం లేద‌ని కేవ‌లం ఒక్క మెమెరాండం ఇద్దామ‌ని వెళితే అడ్డుకోవ‌డం ఏమిట‌ని దుయ్య‌బ‌ట్టారు.

ఆ త‌ర్వాత ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 22A నిషేధిత భూముల జాబితాలో జరిగిన అక్రమాలు, తప్పిదాల పై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ విష‌యంలో తప్పిదం జరిగిందని ఒప్పుకున్న రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేయాలన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా శాంతియుతంగా జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడానికి వెళ్తున్న బీజేపీ నాయకులను పోలీసులు అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ GO ల పేరిట పేద మధ్య తరగతి ప్రజల భూములు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తుందని దుయ్య‌బ‌ట్టారు.

కాంగ్రెస్ పార్టీ అంటేనే దోపిడీ పార్టీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన 22 GO లో అనేక తప్పిదాలు ఉన్నాయని స్వయంగా రాష్ట్ర మంత్రులు ఒప్పుకున్నారని అన్నారు. 22 Go లో జరిగిన తప్పిదాలకు, జరిగిన అక్రమాల పై వెంటనే విచారణ జరిపించి బాధ్యుల పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనికి బాధ్యత వహిస్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, పెద్దపల్లి పురుషోత్తం, ఎనగందుల కృష్ణ మూర్తి, వంగపల్లి వెంకటేశ్వర్ రావు, పట్టి వెంకట కృష్ణ, రమణ రావు, కమలాకర్ రావు, ఆకుల అశోక వర్ధన్, ఆడే ప్రేమ్ సింగ్, పచ్చ సప్న రాణి, బొడ్డు రఘునందన్, అమిరిశెట్టి రాజ్ కుమార్, సత్రం రమేష్, కస్తూరి నాగరాజు, బోట్ల సత్యం, బింగి ప్రవీణ్, నల్ల రవి, మద్ది సుమన్, రాకేష్ రెన్వ, సల్ల సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు

 

You might also like