కొండా సురేఖ బర్తరఫ్ కు గవర్నర్ ఆమోదం

తెలంగాణ మంత్రి మండలి నుండి కొండా సురేఖ బర్తరఫ్‌కు గవర్నర్ శివప్రతాప్‌ శుక్లా ఆమోదం తెలిపారు. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగిస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఆమెను కేబినెట్‌ నుంచి తొలగించాలంటూ సీఎం కార్యాలయం నుంచి లోక్‌భవన్‌కు సిఫారసు లేఖ పంపించారు. తెలంగాణ కాంగ్రెస్‌లో కొనసాగుతున్న అంతర్గత విభేదాల నేపథ్యంలో కొండా సురేఖ వ్యవహారం తీవ్రస్థాయికి చేరింది. సురేఖ కుమార్తె కొండా సుష్మితా పటేల్‌ సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ అధిష్ఠానం తీవ్రంగా స్పందించింది. ఈ వ్యవహారంపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ విచారణ జరిపి, సురేఖపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది..

మంత్రి పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం సురేఖను కోరినట్లు సమాచారం. అయితే ఆమె రాజీనామాకు అంగీకరించకపోవడంతో మంత్రివర్గం నుంచి తొలగించే నిర్ణయం తీసుకున్నారు. సీఎం నిర్ణయం మేరకు తెలంగాణ మంత్రి మండలి నుండి కొండా సురేఖ బర్తరఫ్‌కు గవర్నర్ శివప్రతాప్‌ శుక్లా ఆమోదం తెలిపారు.

You might also like