బీఆర్ఎస్ సభ్యులను అడ్డుకున్న మార్షల్స్
శాసనసభ లాబీల్లో బీఆర్ఎస్ సభ్యులను మార్షల్స్ అడ్డుకున్నారు. వారిని స్పీకర్ సస్పెండ్ చేసిన తర్వాత వారంతా స్పీకర్‌ను కలిసే ప్రయత్నం చేశారు. అయితే, వారిని మార్షల్స్ అడ్డుకున్నారు. సభ్యులను సస్పెన్షన్ వేటు వేసిన తర్వాత శాసనసభలో ఉండటానికి వీలు లేదని స్పష్టం చేశారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శాసనసభా ప్రతిపక్ష నేత ఛాంబర్‌కు వెళ్లి అక్కడ వేచి చూస్తున్నారు. తమకు స్పీకర్ అపాయింట్మెంట్ ఇస్తే ఆయనతో మాట్లాడతామని స్పష్టం చేశారు.
ఒకానొకదశలో బీఆర్ఎస్ సభ్యులు, మార్షల్స్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అసెంబ్లీ గేటు బయట జరిగిన పరిణామాలు, కేసీఆర్ ఫాంహౌస్ ముట్టడికి కాంగ్రెస్ ప్రయత్నాలు ఇలా పలు అంశాలు స్పీకర్ దృష్టికి తీసుకువెళ్తామని స్పీకర్ ను కలిసిన తర్వాతే వెళ్తామని వారు వెల్లడించారు.