అన్ని కార్మిక సంఘాలకు సమాన హోదా కల్పించాలి
TBGKS:సింగరేణిలో గుర్తింపు, ప్రాతినిథ్య కార్మిక సంఘాల కాలపరిమితి ముగిసిన నేపథ్యంలో, అన్ని కార్మిక సంఘాలకు సమాన హోదా కల్పించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ కి ఆ సంఘం నేతలు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన TBGKS ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం పదవీకాలం ముగిసిందని వెంటనే కొత్త ఎన్నికలు నిర్వహించాలన్నారు. అప్పటి వరకు సింగరేణిలోని అన్ని గుర్తింపు, ప్రాతినిధ్య కార్మిక సంఘాలకు సమాన హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో డిప్యూటీ ప్రధాన కార్యదర్శి పెట్టం లక్ష్మణ్, జాయింట్ సెక్రెటరీలు పానుగంటి సత్తయ్య, పొగాకు రమేష్, సెంట్రల్ చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ అన్వేష్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకట్ రెడ్డి, బ్రాంచ్ కార్యదర్శులు గొర్ల సంతోష్, సాదుల భాస్కర్, వెంగల కుమారస్వామి,బుస్స రమేష్ ఏరియా నాయకులు జగదీశ్, తిరుపతి రావు, సముద్రాల అన్వేష్,ఫిట్ కార్యదర్శులు గడ్డం మల్లన్న, దర్ని దేవేందర్, వెంకటరెడ్డి, రవి కుమార్, గడ్డం సుధాకర్, రాజేంద్ర ప్రసాద్, దేవేందర్ రెడ్డి, అలాగే సముద్రాల అన్వేష్, సల్మాన్, వంశీ, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.